వింత వ్యాధితో బాధపడుతున్న స్టార్ హీరో..

0
211

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే సల్మాన్ ఖాన్ అద్భుతమైన సినిమాలు తీస్తూ నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నాడు. 50 సంవత్సరాల వయస్సు దాటినా కూడా చూడడానికి సినిమాలలో యంగ్ హీరోగా కనపడుతూ అమ్మాయిల మనసులను కొల్లగొడుతుంటాడు.

కేవలం హిందీలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. హీరో సల్మాన్ ఖాన్ పెళ్లి ఎప్పుడుచేసుకుంటాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతనికి 50 సంవత్సరాల దాటినా కూడా ఇంకా పెళ్లి జరగపోవడంతో అభిమానులు సందేహ పడుతున్న క్రమంలో తాజాగా మీడియాతో మాట్లాడుతూ తను ఒక వింత వ్యాధితో బాధపడుతున్నటు వెల్లడించాడు.

కొంతకాలంగా ఫేషియల్ సర్వ్ డిజార్డర్స్, ట్రైజెమినల్ న్యూరాల్జియా అనే అరుదైన వ్యాధితో కొట్టుమిట్టాడుతున్నట్టు తెలిపాడు. ఈ వ్యాధి నుండి బయటపడడానికి అనేక రకాల టాబ్లెట్స్ వాడుతూ  తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. ఈ వ్యాధి బారిన పడ్డ వారికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా కలుగుతుందని సల్మాన్ ఖాన్ మీడియాతో వెల్లడించారు