ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాలో కీలక పాత్ర పోషించనున్న స్టార్ హీరో..

0
138

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ యష్ నటించిన కెజిఎఫ్ మూవీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్ ల సునామి సృష్టించడంతో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో  మంచి పేరు సంపాదించుకోవడంతో యంగ్ హీరోలు ఈ డైరెక్టర్ కంబోలో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపుతున్నారు.

అయితే తాజాగా ట్రిపుల్ఆర్ సినిమాతో విశేషాప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న యంగ్ హీరో ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం కమల్​ హాసన్​ను సంప్రదించినట్టు సమాచారం తెలుస్తుంది. ఈ పాత్ర సినిమాకే మెయిన్ హైలైట్గా నిలుస్తుందనే వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది.

ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర విషయానికి వస్తే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెను తీసుకోవాలని చిత్రబృందం యోచిస్తుందట.  అలాగే ఈ సినిమా షూటింగ్​ను అక్టోబర్‌ నుంచి మొదలు పెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబో కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.