తండ్రి కాబోతున్న స్టార్ హీరో?

0
121

తెలుగు సినీ ఇండస్ట్రీలో బెస్ట్ జోడి గా గుర్తింపు తెచ్చుకున్న జంటలలో రానా దగ్గుపాటి మిహిక బజాజ్ జంట కూడా ఒకటి. ఇక ఈ క్యూట్ కపుల్ తమ వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు ఈ జంట.

ఇలా ఉండగా ఎప్పటికప్పుడు సెలబ్రిటీల ఫోటోలు బయటకు వచ్చాయి అంటే చాలు వారిని ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు నెటిజన్స్ నుండి కూడా వస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఒక నెటిజన్ ఫోటోలలో మిహీక కాస్త బొద్దుగా కనిపించడంతో ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే మీరు ప్రెగ్నెంటా అని డౌట్ ను వ్యక్తపరిచారు.

ఈ ప్రశ్నకు ఆమె సమాధానం కూడా చెప్పింది. ఇక ఆ నెటిజన్ నాకు చాలా క్యూరియాసిటీ గా ఉంది అందుకే అడుగుతున్నాను మీరు ప్రెగ్నెంటా అని కామెంట్ చేయగా అప్పుడు ఆమె.. లేదు లేదు.. పెళ్లి అయ్యింది.. ఇంకా పిల్లల కోసం ఎదురు చూస్తున్నాము అంటూ రిప్లై ఇచ్చింది. మిహికా స‌మాధానంతో అభిమానులలో నిరాశ నెలకొంది.