బిగ్ క్లాష్: తగ్గేదే లే అంటున్న స్టార్ హీరో.. KGF- 2 తో పోటీకి సై!

0
95

తమిళ స్టార్ హీరో విజయ్​ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బీస్ట్’. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఈ సినిమా నుండి విడుదలైన ‘అరబిక్​ కుతు’ సాంగ్​ ఎంతగా హిట్​ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఉంది.

‘జాలీ ఓ జిమ్ఖానా’ అంటూ సాగే ఈ సాంగ్​ను హీరో విజయ్​ స్వయంగా ఆలపించడం విశేషం. అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా నెల్సన్‌ దిలీప్​కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమా పూర్తి యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ అప్డేట్ వదిలింది చిత్రబృందం.

ఈ సినిమా ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా బీస్ట్ సినిమా రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది. కాగా ఈ సినిమాలో విజయ్ సరసన పూజాహేగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.  ఏప్రిల్ 14న కేజీఎఫ్-2 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఒక్కరోజు తేడాతో రెండు భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఢీకొట్టబోతున్నాయి.