కరోనా మహమ్మారి మళ్లీ తన విశ్వరూపాన్ని చూయిస్తుంది.సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన మీనా కుటుంబం కరోనా భారిన పడ్డారు. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా పంచుకున్నారు.
‘2022 కొత్త సంవత్సరంలో మా ఇంటికి వచ్చిన తొలి అతిథి మిస్టర్ కరోనా. మా కుటుంబం మొత్తాన్ని ఇష్టపడింది. కానీ, నేను దానికి మా ఇంట్లో చోటు ఇవ్వను. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కరోనా వ్యాప్తికి అవకాశం ఇవ్వకండి.బాధ్యతగా ఉండండి అంటూ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు మీనా.