త్వరలో పెళ్లిపీటలెక్కనున్న లేడీ సూపర్ స్టార్..వరుడు ఎవరంటే?

0
99

లేడీ సూపర్ స్టార్ నయనతార ఎన్నో సినిమాలలో నటించి ఎనలేని గుర్తింపు సాధించుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి అర్ధం ఉన్న కథలను ఎంచుకొని ప్రేక్షకులను తనసొంతం చేసుకుంది. విగ్నేష్‌ శివన్‌ కూడా దర్శకుడిగా మనకు పరిచయం అయ్యి నయనతారతో ప్రేమలో పడ్డాడు. అయితే వీరిద్దరి ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

వీరిద్దరూ గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే. వీరికి ప్రేమకు ముగింపు పలుకుతూ..వివాహ జీవితంలోకి అడుగులు వేయడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. మనందరం ఎదురు చుసిన విధంగానే వీరి పెళ్లి త్వరలో జరగనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి పెళ్లి తేదీ కూడా ఫిక్స్‌ అయినట్టు తెలుస్తుంది.

ఈ పెళ్ళికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో జూన్ 9వ అందరి సమక్షంలో ఒక్కటి కాబోతున్నట్టు సమాచారం తెలుస్తుంది. తిరుమలలో శ్రీవారి సన్నిధిలో అంగరంగవైభవంగా వివాహం జరగనున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు వీరిద్దరూ తమ పెళ్ళి వేదికను బుక్ చేసుకోవడానికి తిరుమల దేవస్థానానికి వచ్చినట్టు సమాచారం తెలుస్తుంది.