సూపర్ స్టార్ రజినీకాంత్ టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు నటించి విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాలు మంచి పేరు సంపాదించుకున్నాయి. ముఖ్యంగా నరసింహా సినిమా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ విలన్ గా నటించి సినిమాను హై లెవెల్ కు తీసుకుపోయింది.
ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో రమ్యకృష్ణ విలన్ గా నటించబోతున్నారని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ నెక్స్ట్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమాకు సన్ పిక్చర్స్ బాధ్యతలు తీసుకొని నిర్మిస్తుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది.
ఐశ్వర్యారాయ్, ప్రియాంకా అరుల్ మోహన్ కీలకపాత్రల్లో విలన్ గా రమ్యకృష్ణ ను తీసుకోవాలని ఆలోచిస్తున్నారట. దానికి రమ్యకృష్ణ కూడా ఒకే చెప్పిందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. రజినీకాంత్- రమ్యకృష్ణ కాంబో కారణంగా ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.