ముఖం పాడు చేసుకున్న స్టార్ హీరోయిన్..సర్జరీనే కారణమా?

0
95

బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది దిశా పటానీ. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ..ప్రస్తుతం ఈ అమ్మడు వరుస చిత్రాలతో బిజీగా గడిపేస్తుంది. ఇటీవల మాల్డీవుల్లో ఎంజాయ్ చేస్తూ.. తన లెటేస్ట్ ఫోటోస్ ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేసింది దిశా పటాని.

గ్లామరస్ పాత్రలతో యూత్‏ను అట్రాక్ట్ చేస్తోన్న దిశా పటానిను ఇప్పుడు నెటిజన్స్ ఓ రేంజ్‎లో ట్రోల్స్ చేస్తున్నారు. తన ముఖం ఎందుకు అలా మారిపోయిందని సర్జరీ చేయించుకుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో దిశా పటానీ ముఖ కవళికల గురించి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దిశా ఫేస్ నార్మల్ గా ఉందనిదిశా తన ముక్కు, పెదవులు సర్జరీ చేయించుకున్నట్లుగా ఉందని.. ఇప్పుడు అస్సలు బాగోలేదని కామెంట్స్ చేస్తున్నారు.

దిశా పటానీ సర్జరీ చేయించుకోకపోతే బాగుండేదని..ఇలా మారిపోవడం బాగలేదని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం దిశా పటానీ లెటేస్ట్ లుక్ ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ హీరోయిన్.