రోజూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ వీకెండ్స్‌లో ఆ వినోదాన్ని రెట్టింపు చేస్తోన్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్ సీజన్-5’. ఈ వారం హౌస్‌లో ఉన్న 16 మందిలో ఎనిమిది మంది నామినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో మొదటగా రవి, ప్రియ, సన్నీ, కాజల్‌లు సేఫ్ అయ్యారు. సిరి, నటరాజ్, లోబో, అనీ మాస్టర్‌లు ఇంకా నామినేషన్స్‌లో కొనసాగుతున్నారు.
ఈ వారం నామినేషన్స్ నుంచి శుక్రవారం వరకూ జరిగిన పరిణామాలను విశ్లేషిస్తూ హౌస్‌మేట్స్‌కు క్లాస్ తీసుకున్నారు వ్యాఖ్యాత నాగార్జున. ముఖ్యంగా హౌస్‌మేట్స్ బరువు తగ్గిన దాన్ని ప్రశంసించారు. ఇక నామినేషన్స్ సందర్భంగా లోబో ప్రవర్తనను ఖండించారు. ‘నా వరకూ నేను బరాబర్ చేసిన.. జనాలకు ఏం నచ్చుతుందో, నచ్చటం లేదో నాకు తెలియదు సర్’ అని లోబో అనగా, ‘అరవటం కూడా బరాబర్ అంటావా’ అనగా ‘లవ్ పదం ఎత్తగానే నాకు కోపం వచ్చింది’ అని లోబో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు.
లోబోను చూస్తే నాకు భయం వేసింది. ఒంటరిగా నేను గదిలో ఉన్నప్పుడు లోబో వస్తే వణికిపోయేదాన్ని’ అంటూ నాగార్జున ఎదుట ప్రియ వాపోగా, ‘బిగ్‌బాస్ హౌస్‌ను మించిన భద్రమైన ప్రదేశం మరొకటి లేదు’ అంటూ నాగార్జున భరోసా ఇచ్చారు. షణ్ముఖ్, సిరిలకు పచ్చి మిర్చి తినిపించిన నాగ్..‘కూర్చొని కబుర్లు చెబుతున్నావేం’ అంటూ షణ్ముఖ్‌ను, ‘అమ్మా నీ ఆట నువ్వు ఆడమ్మా’ అంటూ సిరికి గట్టి ఝలక్ ఇచ్చారు. లవ్ ట్రాక్ నడుపుతున్న శ్రీరామచంద్ర-హమీదాలను ఆటపట్టించారు.
ఈ వారం నామినేషన్స్ ఉన్న 8 మందిలో శనివారం నలుగురు సేఫ్ అయ్యారు. సిరి, నటరాజ్, లోబో, అనీ మాస్టర్‌లు ఇంకా నామినేషన్స్‌లో కొనసాగుతున్నారు. మరి వీరిలో ఎలిమినేట్ అయ్యేదెవరో తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే.