ఓటీటీలోకి వచ్చేసిన స్త్రీ2

-

ఓ మాత్రం అంచనాలతో వచ్చి బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన సినిమా ‘స్త్రీ2(Stree 2)’. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ మూవీ కలెక్షన్స్‌ను కూడా దాటేసింది స్త్రీ2. శ్రద్ధాకపూర్(Shraddha Kapoor), రాజ్‌కుమార్ రావు(Rajkummar Rao) జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో తనదైన మార్క్ చూపించుకుంది. నవ్వించడంలోనే కాకుండా భయపెట్టడంలో కూడా స్త్రీ2 అదరగొట్టింది. ఆగస్ట్ 15న విడుదలైన ఈ సినిమా.. జాన్ అబ్రహం ‘వేదా’, అక్షయ్ కుమార్ ‘ఖేల్ ఖేల్ మే’ సినిమాలకు గట్టి పోటీ ఇచ్చింది. శ్రద్ధాకపూర్‌కు ఈ సినిమా చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకుంటే అమ్మడి కెరీర్‌లో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమా ఇదే. ఈ సినిమా రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

- Advertisement -

థియేటర్లలో అదరగొట్టిన స్త్రీ2(Stree 2) ఇప్పుడు ఓటీటీ టాప్ లేపడానికి రెడీ అయింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటీటీ రిలీజ్ అయింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రేక్షకుల నిరీక్షణ ఎట్టకేలకు నెరవేరింది. కాకపోతే.. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్.. ఫ్రీగా అందించడం లేదు. ఈ సినిమాను ప్రస్తుతానికి రెంటల్‌గానే అందిస్తోంది. కాబట్టి అమెజాన్ ప్రైమ్‌లో స్త్రీ2 చూడాలంటే రూ.349 చెల్లించాలి. కొన్ని రోజుల తర్వాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఉచితంగా లభిస్తుంది. ఫ్రీగా చూడాలనుకునే వాళ్లు అప్పటి వరకు ఆగాల్సిందే.

Read Also: ‘నాకు పర్ఫెక్ట్’.. నాగ చైతన్యతో నిశ్చితార్థంపై శోభిత
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...