ఓటీటీని అదరగొడుతున్న హారర్ థ్రిల్లర్

-

ఇటీవల విడుదలై బంపర్ హిట్ అయిన సినిమా ‘స్త్రీ 2’(Stree 2). ఇందులో రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) జంటగా నటించారు. తొలి రోజు నుంచి కూడా ఈ సినిమా కలెక్షన్లతో పాటు అభిమానుల ఆదరణ విషయంలో కూడా అదరగొడుతోంది. థియేటర్లలో విడుదలైన ఏకంగా రూ.870 కోట్లు రాబట్టింది. హారర్ కామెడీగా వచ్చిన ఈ సినిమా స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో కూడా అదరగొట్టేస్తోంది. ఓటీటీలో సైతం ఏమాత్రం తగ్గకుండా రెచ్చిపోతూ ఇక్కడ కూడా రికార్డ్‌లు సృష్టిస్తోందీ సినిమా.

- Advertisement -

అక్టోబర్ 10న ఓటీటీలోకి వచ్చిన ‘స్త్రీ 2’ తొలి రోజూు నుంచే వ్యూస్ విషయంలో దూసుకుపోతోంది. హిందీలో మాత్రమే అందుబాటులో ఉన్నా అభిమానులు మాత్రం భాషతో పనిలేనట్లే తెగ చూసేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఆల్ ఇండియా ట్రెండింగ్‌లో టాప్‌లో నిలిచింది. సెప్టెంబర్ చివర్లో రెంటల్‌ విధానంలో అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్ 10న అమెజాన్ సబ్‌స్క్రైబర్లకు ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ సినిమా వ్యూస్ భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఆల్ ఇండియా లెవెల్లో స్త్రీ2(Stree 2) అదరగొట్టేస్తోంది.

Read Also: నోని పండు లాభాలు తెలిస్తే అస్సలు నో చెప్పరు!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...