శివకార్తికేయన్(Sivakarthikeyan), సాయిపల్లవి(Sai Pallavi) జంటగా నటించిన ‘అమరన్’ సినిమా బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. ఇప్పుడు ఓటీటీ(Amaran OTT) రిలీజ్‌కు సన్నద్ధమవుతోంది. కాగా ఈ క్రమంలో ఈ సినిమా ఓటీటీ విడుదలను ఆపేయాలంటూ ఓ విద్యార్థి కోర్చుకెక్కాడు. ఈ సినిమా వల్ల తనకు మానసిక క్షోభకు గురయ్యానంటూ ఇప్పటికే మూవీ టీమ్‌కు విఘ్నేశన్ అనే విద్యార్థి లీగల్ నోటీసులు పంపించాడు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ను అడ్డుకోవాలంటూ అతడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు.
సినిమాలో తన అనుమతి లేకుండా తన ఫోన్ నెంబర్‌ను వినియోగించారని, దాని వల్ల ప్రతిరోజూ వందల కాల్స్ తనకు వస్తున్నాయని, అది తనను తీవ్ర మానసకి వ్యధకు గురి చేసిందని అతడు తన నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అతడు తనకు సినిమా యూనిట్ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఇంతలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవ్వడంతో అతడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు.
‘అమరన్’ మూవీ టీమ్ నుంచి తనకు ఇంకా నష్టపరిహారం అందలేదని, అలాంటప్పుడు ఈ సినిమాను ఓటీటీ(Amaran OTT) రిలీజ్‌ను నిలిపివేయాలని అతడు తన పిటిషన్‌లో కోరాడు. అంతేకాకుండా సినిమా నుంచి తన ఫోన్ నెంబర్ వాడిన సన్నివేశాలు కూడా తొలగించలేదని అతడు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. దాని వల్ల కలుగుతున్న అసౌకర్యం తనకు ఇంకా తీరలేదని, ఇప్పటికి కూడా తనకు ప్రతిరోజూ తెలియని వారి నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయని అతడు తన పిటిషన్‌లో వివరించాడు. ఇదిలా ఉంటే తనకు రూ.1.1కోటి నష్టపరిహారం ఇవ్వాలని విఘ్నేశన్ డిమాండ్ చేశాడు.