సినిమాలు అయినా టెలివిజన్ లో అయినా నటులకి అంత ఈజీగా అవకాశాలు రావు, అందరూ నిలదొక్కుకోలేరు, అయితే ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్ కు వచ్చి మంచి యాంకర్ గా కమెడియన్ గా స్కిట్ల రైటర్ గా పేరు సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్, జబర్ధస్త్ తో తన చరిష్మా చూపించాడు, టాలెంట్ పర్సన్ అని నిరూపించుకున్నాడు.
ఎన్నో కష్టాల్ని దాటుకుని వచ్చి హీరోగా ఎదిగాడు సుధీర్.. మరి అతని జీవితంలో కొన్ని విషయాలు తెలుసుకుందాం.సుధీర్ అసలు పేరు సుధీర్ ఆనంద్ బయానా..కృష్ణా జిల్లా విజయవాడ. అతనికి చెల్లి ఓ తమ్ముడు ఉన్నాడు…స్టార్ మా వారు నిర్వహించిన స్టార్ హంట్ లో పాల్గిని ఫైనల్స్ కి చేరుకున్నాడు ఆనాడు సుధీర్, ఏకంగా ఇంటర్ పరీక్షలు వదిలేసి ఈ ప్రోగ్రాంకి వచ్చాడు.
కానీ, ఫైనల్స్ లో విజేత కాలేకపోయాడు..చిన్నప్పటి నుండి మేనమామ దగ్గర నేర్చుకున్న మ్యాజిక్ విద్యతో ఎన్నో స్టేజ్ షోలు ఇచ్చాడు…అతడి తండ్రికి యాక్సిడెంట్ జరగడంతో కుటుంబం భారం అతనిపై పడింది ఈ సమయంలో మూడు షోలు రోజూ చేసేవాడు ఎన్నో కష్టాలు అనుభవించాడు.
ఆ డబ్బు ఇంటికి పంపేవాడు.. తర్వాత ఆ షో వదిలేసి సినిమాల్లోకి రావాలి అని ప్రయత్నాలు మొదలుపెట్టాడు, తినడానికి తిండి లేదు..తాగడానికి నీళ్లు కూడా కష్టం అయిన రోజుల్లో సింక్ నీళ్లు తాగి బతికిన చేదురోజులున్నాయి సుధీర్ జీవితంలో.. అతనికి గెటప్ శీను పరిచయంతో జబర్దస్త్లో చోటు సాధించాడు.వేణు వండర్స్ టీం మెంబర్ గా కెరీర్ స్టార్ట్ చేసి, తర్వాత సుడిగాలి సుధీర్ అండ్ టీం లీడర్ గా ఎదిగాడు, ఇప్పుడు ఆరు షోలు మూడు సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా తన లైఫ్ లీడ్ చేస్తున్నాడు, నిజమే జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు కష్టాలు చూసిన తర్వాతే సక్సెస్ వస్తుంది.