అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో వైకుంఠపురం లో అనే సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా తో పాటు బన్నీ రెండు సినిమాలను అనౌన్స్ చేశాడు.. ఒకటి సుకుమార్ తో అయితే ఇంకోటి వేణు శ్రీరామ్ తో ఐకాన్ అనే సినిమా.. అయితే త్రివిక్రమ్ తో సినిమా అయిపోయిన తర్వాత బన్నీ వేణు శ్రీరామ్ తో సినిమా చేయాలి.. ఆ వెంటనే సుకుమార్ సినిమా కోసం బన్నీ పని చేస్తాడు. మరోవైపు సుకుమార్ చాలా తొందర పెడుతున్నాడట. దీంతో అల్లు అర్జున్ వేణు శ్రీరామ్‌కు హ్యాండ్ ఇచ్చేశాడని.
ఈ విషయం ఇప్పటికే అటు నిర్మాత దిల్ రాజుతో పాటు వేణు శ్రీరామ్‌కు సైతం చెప్పేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. కథ నా పేరు సూర్య టైప్‌లో రిస్కీగా ఉండడంతో పాటు భారీ బడ్జెట్ కావడంతో మనోడు ఆ సాకు చూపించి వేణుశ్రీరామ్‌కు హ్యాండిచ్చినట్టు టాక్. నిర్మాత రాజుకు మాత్రం మరో కథతో మీ సినిమా చేస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం.