అల్లు అర్జున్ లేకుండానే ఆ వర్క్ ఫినిష్ చేసిన సుకుమార్

అల్లు అర్జున్ లేకుండానే ఆ వర్క్ ఫినిష్ చేసిన సుకుమార్

0
83

అల్లు అర్జున్ అల వైకుంఠపురం చిత్రంలో పూర్తిగా బిజీగా ఉన్నారు.. ఇక తాజాగా ఆయన సుకుమార్ చిత్రాన్ని రెడీ చేసి వర్క్ కూడా స్టార్ట్ చేశారు.. ఆ సినిమాలో ఆయన ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ గా కనిపిస్తారట. అయితే తెలియక చేస్తారా తెలిసి చేస్తారా ఇందులో బన్నీ రోల్ ఏమిటి అనేది ఇంకా రివీల్ కాదు, అయితే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగును పూర్తిచేశారు చిత్ర యూనిట్.. ఇక ఎర్ర చందనం అంటే కచ్చితంగా అడవుల్లో షూటింగ్ ఉంటుంది కాబట్టి ఆయన ప్లాన్ ప్రకారం కేరళ అడవుల్లో వారం రోజుల పాటు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్ పాల్గొనలేదు అని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సంక్రాంతికి విడుదల కానున్న ‘అల వైకుంఠపురములో’ సినిమాపైనే దృష్టి పెట్టాడు.

అందువలన అల్లు అర్జున్ పాత్రతో సంబంధంలేని సన్నివేశాలను ఇతర నటీనటులపై చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ ను కూడా సుకుమార్ కేరళలోనే ప్లాన్ చేశాడనీ, ఆ షెడ్యూల్లో అల్లు అర్జున్ పాల్గొంటాడని అంటున్నారు. అది సంక్రాంతి తర్వాత ఉంటుందా లేదా ముందు ఉంటుందా అనేది ఇంకా ఫిక్స్ కావాల్సి ఉంది.