బన్నీ కోసం స్క్రిప్ట్ పూర్తిచేసిన సుకుమార్

బన్నీ కోసం స్క్రిప్ట్ పూర్తిచేసిన సుకుమార్

0
82

ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అలా వైకుంఠపురం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత బన్నీ సుకుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ ఓ కథను రెడీ చేశాడు.

అయితే మొదట్లో ఈ కథ నచ్చలేదన్న బన్నీ సుకుమార్ కొన్ని మార్పులు చేసిన అనంతరం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.అయితే ఆ తర్వాత బన్నీ మనసు మార్చుకున్నాడా.. వీరి కాంబినేషన్లో ఆర్య, ఆర్య-2 లాంటి ప్రేమ కథ చిత్రలే వచ్చాయి, కనుక అదే తరహా సినిమానే చేద్దామని చెప్పాడట.

దీంతో సుకుమార్ బన్నీ కి మరో లైన్ వినిపించడం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇట్టే జరిగిపోయాయట. తాజాగా స్క్రిప్ట్ ను పూర్తిచేసిన సుకుమార్ మిగతా పనులపై దృష్టి పెట్టాడని టాక్.