ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా పుష్ప. ఈ సినిమాను టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించారు.ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది. అయితే.. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది.
ఈ సినిమా పై పాజిటివ్ టాక్ రావడంతో… జనాలు ఎగబడి చూసారు. పుష్ప సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సౌత్ లో కంటే నార్త్ లో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు పుష్ప 2 కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే పుష్ప 2 సినిమా త్వరలోనే రానుందని చిత్ర బృందం వెల్లడించింది.
అయితే పుష్ప 3 గురించి ఓ న్యూస్ హల్ చల్ చేస్తుంది. పుష్ప 2 తోనే సినిమాను ఆపేయాలని అనుకోవడం లేదని, పుష్ప 3 కూడా తీయాలనుకుంటున్నాడట సుకుమార్. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అందుకు తగ్గట్టు కథను కూడా రెడీ చేసే పనిలో పడ్డాడట కూడా. దీనిపై సుకుమార్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.