హీరో రజనీకాంత్ కాల్ చేసి నన్ను ఆ ప్రశ్న అడిగారు

హీరో రజనీకాంత్ కాల్ చేసి నన్ను ఆ ప్రశ్న అడిగారు

0
94

హీరో సుమన్ తన కెరియర్లో చాలా సినిమాల్లో మంచి పాత్రలు చేశారు… నాటి నేటి అభిమానులు అందరికి ఆయన శివాజీ సినిమాలో నటించిన పాత్ర మాత్రం అదుర్స్ అనే చెబుతారు.. హీరోగా చూసిన ఆయన్ని ఇలా విలన్ రోల్ లో చూసే సరికి అందరూ షాక్ అయ్యారు.. కాని సినిమాలో రజనీ తర్వాత అంత పేరు ఆయనకే వచ్చింది శివాజీ చిత్రంలో.

తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న సుమన్ కొన్ని సినిమా విషయాలు ప్రస్తావించారు. తమిళ చిత్ర పరిశ్రమకి దూరమై చాలాకాలం అయింది అక్కడ ఒక సినిమా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా ఈ సమయంలోనే, దర్శకుడు శంకర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. వెంటనే ఆయనని కలిశాను అని చెప్పారు సుమన్.

ఇక అప్పుడు శివాజీ కథ నాకు వినిపించారు .. పెద్ద బ్యానర్ నిర్మాతలు తెలుసు, పైగా దర్శకుడు శంకర్ అలాగే రజనీకాంత్ పక్కన నటించడం, ఇక రెహ్మన్ సంగీతం ఇవన్నీచూసి నేను ఒకే చెప్పాను అన్నారు సుమన్. ఆ తరువాత రజనీకి కాల్ చేశారు .ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నందుకు మీరేం ఫీల్ కావడం లేదు గదా అని రజనీ అడిగారు. అలాంటిదేమీ లేదు సార్ మీ ఆశీస్సులు కావాలని చేశాను అన్నాను. ఈ సినిమాలో విలన్ రోల్ మీకు మంచి పేరు తెస్తుంది అన్నారు.అలాగే నాకు పేరు వచ్చింది అని తెలిపారు సుమన్.