సినిమాకు మాటలు రాయడంతో పరుచూరి బ్రదర్స్ స్టయిలే వేరు… చాలా మంది వారి దగ్గర శిష్యరికం చేసి సినిమాల్లో అగ్ర దర్శకులుగా మాటల రచయితలుగా వెలుగొందుతున్నారు..తాజాగా పరుచూరి పలుకులు కార్యక్రమంలో హీరో సుమన్ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. ఆయన గురించి పలు విషయాలు చెప్పారు..
సినిమా పరిశ్రమకు మేము 1978లో ప్రవేశించాము.. ఆ సమయంలో సుమన్ తో కలిసి మేము సినిమాలు చేసే అవకాశం రాలేదు.. సుమన్ సినిమాలను ఓంకార్ ఎక్కువగా రాసేవారు. సుమన్ హీరోగా మేము రాసిన మొదటి సినిమా రక్తకన్నీరు..ఓ కేసు నుంచి బయటికి వచ్చిన తరువాత ఆయన చేసిన తొలి సినిమా ఇదే అని తెలియచేశారు.
ఇక ఆ చిత్రంలో నేను నటించాను ఓ వేషం వేశాను, జెంటిల్ మెన్ అని అనుకుంటే అందులో సుమన్ కచ్చితంగా ఉంటారు.రచయితలకు గౌరవం ఇస్తారు. ఇక తనపై ఏ విమర్శలు వచ్చినా చిరునవ్వుతో వాటిని పట్టించుకోరు అని సుమన్ గురించి ఆయన మంచితనం