సినిమా పరిశ్రమలో దాదాపు 50 ఏళ్లుగా హీరోల తనయులు పరిశ్రమలో అరంగేట్రం చేస్తున్నారు, అంతేకాదు సూపర్ హిట్ సినిమాలు చేసిన వారు కొందరు అయితే మరికొందరు మాత్రం సినిమాలు లేక ఇబ్బంది పడిన వారు ఉన్నారు.. ఏది ఏమైనా అభిమానులని మెప్పించకపోతే వారసుడు అయినా సినిమాల నుంచి తప్పుకోవాల్సిందే, అయితే ఇలా చాలా మంది పెద్ద ఆకట్టుకలేక సినిమా పరిశ్రమ నుంచి బయటకు వచ్చారు.
అయితే తాజాగా కనకాల ఫ్యామిలీ నుంచి ఓ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు, రాజీవ్ కనకకాల సుమ దంపతుల కొడుకు రోషన్ తెలుగులో ఓ సినిమా చేస్తున్నాడు..రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రోషన్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారని తెలుస్తోంది. కొత్త దర్శకుడు విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
మరో నిర్మాణ సంస్థతో కలిసి సుమ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందని సమాచారం. ఇక త్వరలోనే చిత్రానికి సంబంధించి అప్ డేట్ రానుంది, అయితే కనకాల ఫ్యామిలీకి చిత్ర సీమలో ఎంతో పేరు ఉంది.నటుడు దర్శకుడు దేవదాస్ కనకాల హైదరాబాద్ లో యాక్టింగ్ స్కూల్ ఏర్పాటు చేసి ఎంతోమందికి నటనలో మెళకువలు నేర్పించారు.ఆయన భార్య లక్ష్మీ కనకాల కూడా
ఈ స్కూల్ లో నటనలో మెళకువలు నేర్పించారు అనేది తెలిసిందే, చాలా మంది ప్రముఖ హీరోలు ఆర్టిస్టులు ఇక్కడ నుంచి వచ్చిన వారే.