సునిశిత్ టార్చ‌ర్ త‌ట్టుకోలేక కంప్లైంట్ ఇచ్చిన హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి

సునిశిత్ టార్చ‌ర్ త‌ట్టుకోలేక కంప్లైంట్ ఇచ్చిన హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి

0
110

మైక్ కనబడితే చాలు అడ్డదిడ్డంగా మాట్లాడి ఎలాగోలా ఫేమస్ అయిపోవాలని ఈ మధ్య కొందరు భావిస్తున్నారు. తాజాగా ఇలాంటి వ్య‌క్తి సోష‌ల్ మీడియాలో పెద్ద హీరో అయ్యా అనేలా ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు, ఏకంగా పెద్ద పెద్ద సెల‌బ్రీటీలు తెలుసు అంటున్నాడు, అక్క‌డ నుంచి మ‌రీ దారుణంగా కొన్ని కామెంట్లు చేస్తున్నాడు, కెమెరా ముందు సునిశిత్ అనే వ్యక్తి చేసిన కామెంట్ల ఇప్పుడు హీరోయిన్ కు కోపం తెప్పించింది.. చివ‌ర‌కు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది.

హీరోయిన్ లావణ్య త్రిపాఠి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సునిశిత్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకున్నానని అసత్య ప్రచారం చేస్తున్నట్లుగా ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. ఈ విషయమై రాతపూర్వక ఫిర్యాదును ఆమె తన అసిస్టెంట్‌ ద్వారా ఏసీపీ కెవిఎమ్ ప్రసాద్‌కు అందజేశారు.

సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా లావణ్య త్రిపాఠిని సునిశిత్ అనే వ్యక్తి టార్గెట్ చేస్తూ ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు దీంతో అత‌ని తిక్క కుదిర్చింది ఆమె.మహేష్ బాబు, రవితేజ వంటి హీరోలు నాకొచ్చిన అవకాశాలను కొట్టేశారంటూ డిఫ‌రెంట్ కామెంట్లు చేశాడు, అందుకే మైక్ ఉంది క‌దా అని ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌కూడ‌దు.. హీరోయిన్స్ లావణ్య త్రిపాఠి, తమన్నాలను పెళ్లి చేసుకుని, వదిలేశానని చెబుతున్నాడు దీంతో ఇప్పుడు లావ‌ణ్య కంప్లైంట్ ఇచ్చింది.