ఉదయ్ కిరణ్ గురించి సంచలన విషయాలు చెప్పిన సునీల్

ఉదయ్ కిరణ్ గురించి సంచలన విషయాలు చెప్పిన సునీల్

0
87
Actoe Sunil

కమెడియన్ సునీల్ తెలుగులో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకున్న హీరో, అయితే వివాదాలకు కూడా ఆయన చాలా దూరంగా ఉంటారు.. ఆయన తాజాగా ఆనాటి హీరో పైగా లవ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఉదయ్ కిరణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.

ఆనాడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే.. ఎంతో గొప్ప స్టేజ్ చూసిన ఉదయ్ కిరణ్ , తర్వాత సినిమా అవకాశాలు లేక చనిపోయాడు, ఇది ఆనాడు ఎంతో మందిని బాధపెట్టింది.అలాంటి ఉదయ్ కిరణ్ కి సంబంధించిన ఒక సంఘటనను నటుడు సునీల్ తలచుకున్నాడు.

సునీల్ ఉదయ్ కిరణ్ సినిమాలు గతంలో చాలా హిట్.. ఇద్దరూ కలిసి నటించారు అంటే ఆ సినిమా హిట్ అవ్వాల్సిందే, అయితే నువ్వు నేను సినిమా కూడా వీరికి ఎంతో పేరు తెచ్చింది, ఈ సినిమాలో రన్నీంగ్ సీన్ ఉంది, ఈ సమయంలో కొంతమంది ప్రొఫెషనల్స్ రన్నర్స్ ని తీసుకువచ్చారు..

వారిని ఓడించి సినిమాలో పరిగెత్తాలి ఉదయ్ కిరణ్ పైగా అందులో గెలవాలి , అయితే ఉదయ్ కిరణ్ మెరుపు వేగంతో వారిని దాటి పరుగులు పెట్టాడు… అక్కడ షూటింగులో వున్న మేమంతా ఆశ్చర్యపోయాము. అంతలా ఎలా పరిగెత్తావ్ రా అని అడిగాను ఏమీ లేదు సిటీ బస్సులు వెంట పరిగెత్తిన అనుభవం ఇప్పుడు పనికొచ్చింది అని కామెడీ చేశాడు…అది అతని సింపుల్ సిటీ, ఉదయ్ కిరణ్ చాలా మంచి వ్యక్తి అని చెప్పారు సునీల్.