సునీల్ కు గుడ్ న్యూస్ ఆ సినిమాలో ఛాన్స్ ?

సునీల్ కు గుడ్ న్యూస్ ఆ సినిమాలో ఛాన్స్ ?

0
119

సునీల్ చేసే కామెడీ అంటే తెలుగు వారు అంద‌రికి ఇష్ట‌మే, ఆయ‌న చేసిన కామెడీ సినిమాలు క‌మెడియ‌న్ గా ఆయ‌న‌ని అగ్ర‌స్ధానంలో నిల‌బెట్టాయి, ఇక ఆయ‌న స్నేహితుడు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ కూడా ఆయ‌న సినిమాల్లో సునీల్ కు క‌చ్చితంగా రోల్ ఇస్తారు అనేది తెలిసిందే, ఆ స్టోరీలో సునీల్ పాత్ర‌ల‌కు కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది.

అయితే ఇటీవ‌ల త్రివిక్ర‌మ్ తీసిన సినిమాల్లో సునీల్ కూడా క‌నిపిస్తున్నారు, తాజాగా త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్ కాంబో సెట్స్ పైకి వెళ్ల‌నుంది, ఈ సినిమాలో కూడా సునీల్ కు అవ‌కాశం ఉంది అంటున్నారు.
తాజాగా విడుద‌ల అయిన అరవింద సమేత .. అల వైకుంఠపురములో సినిమాల్లో త్రివిక్రమ్ అవకాశాలను ఇచ్చారు.

ఇప్పుడు మ‌రోసారి తార‌క్ సినిమాలో మంచి రోల్ సునీల్ చేయనున్నారు అని తెలుస్తోంది, ఇక త్రివిక్ర‌మ్ సునీల్ ఇద్ద‌రూ కూడా మంచి మిత్రులు అనేది తెలిసిందే, సినిమా ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన కొత్త‌లో ఇద్ద‌రూ కూడా ఒకే రూమ్ లో ఉండి అవ‌కాశాల కోసం తిరిగేవారు. ఇలా ఆ నాటి నుంచి వీరి స్నేహం కొన‌సాగుతూనే ఉంది.