శ్రీముఖికి సూపర్ అవార్డ్

శ్రీముఖికి సూపర్ అవార్డ్

0
87

యాంకరింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు స్పాంటెనియస్ గా మాట్లాడాలి అందుకే ఈ రంగంలో చాలా తక్కువ మంది నిలదొక్కుకుంటారు, అందులో శ్రీముఖి కూడా ఇప్పుడు ఎంతో ఫేమ్ సంపాదించుకుంది, ఇక అనేక షోలకు యాంకరింగ్ చేస్తోంది, పలు సినిమా ఈవెంట్లకు కూడా ఆమె యాంకరింగ్ చేస్తోంది, సినిమా ప్రమోషన్స్ లో కూడా ఆమె ఇంటర్వ్యూలు చేస్తూ సరదా సంభాషణ సాగిస్తుంది.

అయితే అందరిని నవ్వుతూ నవ్విస్తూ పలకరించే నైజం ఆమెది, ఇక బిగ్ బాస్ టైటిల్ కోసం చివరి వరకూ పోటీ పడింది శ్రీముఖి, కాని ఆమెకు చివరి నిమిషంలో టైటిల్ రాలేదు, బిగ్ బాస్-3తో ఆమె హవా మరింత విస్తరించింది. తాజాగా ఆమెకు ఓ అవార్డు సొంతం అయింది…హైదరాబాద్ టైమ్స్ మీడియా సంస్థ మోస్ట్ డిజైరబుల్ గా ఉమన్ బుల్లితెర గా శ్రీముఖిని ఎంపిక చేసింది.

2019కి గాను ఈ గౌరవం దక్కింది. ఆన్ లైన్ పోల్ లో అత్యధికులు శ్రీముఖికే ఓటేశారు. దీనిపై శ్రీముఖి స్పందిస్తూ, తాను టెలివిజన్ రంగానికి సంబంధించి మోస్ట్ డిజైరబుల్ ఉమన్ గా ఎంపికవుతానని అస్సలు ఊహించలేదని తెలిపింది. అయితే యూత్ చాలా మంది ఆమెని ఇష్టపడతారు యాంకరింగ్ లో కొత్తధనం చూపించింది. ముఖ్యంగా అమ్మాయిల ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు శ్రీముఖికి.

హైదరాబాద్ టైమ్స్ నిర్వహించే ఈ ఆన్ లైన్ పోల్ ను బాగా ఫాలో అయ్యేదాన్నని, ఎప్పటికైనా గెలవాలని అనుకునేదాన్నని వెల్లడించింది. గత ఏడాది ఇదే పోల్ లో శ్రీముఖి 11వ స్ధానంలో నిలిచింది.