డిశ్చార్జ్ అయిన రజనీ.. షూటింగ్ అప్పటి నుంచే..

-

సూపర్ స్టార్ రజనీకాంత్(RajiniKanth) తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ఉన్నారు. అయితే ఇటీవల ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయిన వార్త విని వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆరోగ్యంగా ఉన్నారు అని అనిపించుకున్న రోజుల వ్యవధిలోనే ఆయన ఆసుపత్రిపాలవడం ఏంటని అందరూ ఆవేదన చెందారు. ఆయనకు శస్త్ర చికిత్స చేసి గుండెకు స్టంట్ వేసినట్లు వైద్యులు చెప్పారు. అయితే ఆయన అభిమానులు తాజాగా రజనీకాంత్ గుడ్‌న్యూస్. ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. గురువారం అర్థరాత్రి 11 గంటలకు ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజనీ కాంత్ తన అభిమానులకు అభివాదం చేస్తూ ఇంటికి వెళ్లిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

- Advertisement -

కాగా ఆయన తన అప్‌కమింగ్ సినిమా ‘కూలీ’ షూటింగ్‌లో మూడు వారాల విరామం తర్వాత పాల్గొననున్నారు. లోకేష్ కనగరాజన్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా యాక్షన్ ప్యాక్డ్‌గా రానుంది. దీంతో ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్‌కు కొదవ ఉండదు. ఈ క్రమంలోనే రజనీకాంత్(RajiniKanth) పూర్తిగా కోలుకున్న తర్వాతే మళ్ళీ షూటింగ్ రీస్టార్ట్ చేయనున్నట్లు మూవీ టీమ్ చెప్పింది. ఈలోపు మిగిలిన సన్నివేశాలను చిత్రీకరించనుంది ‘కూలీ’ టీమ్.

Read Also: యానిమల్ బ్యూటీ తృప్తి మోసం చేసిందా…! ఆమె టీమ్ ఏమంటోందంటే..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...

Maha Kumbh Mela | మహా కుంభమేళాలో మరో ఆధ్యాత్మిక అద్భుత ఘట్టం

మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో మరో ఆధ్యాత్మిక అద్భుతం ఆవిష్కృతం కానుంది....