సూపర్ స్టార్ సూపర్ స్టైలిష్ లుక్..మహేష్ బాబు కొత్త లుక్ చూశారా?

0
97

టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పవన్ కళ్యాణ్, ప్రభాస్ తరువాత అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో మహేష్‌ బాబు. సూపర్ స్టార్ ఇటీవల “సర్కారు వారి పాట” సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.

ఇక ఈ సినిమా తరువాత మహేష్ వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్, రాజమౌళి, కొరటాల వంటి స్టార్స్ తో పని చేయాల్సి ఉంది. అయితే తాజాగా త్రివిక్రమ్ సినిమా నుండి అ కొత్త స్టిల్ ద్వారా ఓ క్లారిటీ ఇచ్చారు మ‌హేశ్​ బాబు. సోమ‌వారం మ‌హేశ్​ షేర్​ చేసిన న్యూ లుక్ ఫొటో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇందులో లైట్​గా గ‌డ్డం, మీసంక‌ట్టుతో స్టైలిష్‌గా మ‌హేశ్​ క‌నిపిస్తున్నారు. ‘లవింగ్ ది న్యూ వైబ్’ అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత మహేశ్​ లుక్​ను సంగీత దర్శకుడు త‌మ‌న్, డైరెక్టర్​ తివ్రిక్రమ్​.. ‘ఎస్ఎస్ఎమ్‌బీ 28’ హ్యాష్​ ట్యాగ్​ ఇచ్చి ట్వీట్ చేశారు.