Mahesh Babu | ‘మావా ఎంతైనా’ అంటూ మహేష్ బాబు ఎమోషనల్..

-

మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా వస్తున్న ‘గుంటూరు కారం(Guntur Kaaram)’ సినిమా ఇంకో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్, సాంగ్స్ విడుదల చేయగా.. తాజాగా సెలైంట్‌గా ‘మావా ఎంతైనా’ అంటూ సాగే పాటను విడుదల చేసి షాక్ ఇచ్చింది. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండ్‌లో ఉన్న ఈ పాటలో మహేష్ స్టెప్పులు ఇరగదీశాడు.

- Advertisement -

ఇదిలా ఉంటే మంగళవారం రాత్రి గుంటూరులో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ “ప్రతి సంక్రాంతికి మా సినిమాలు బ్లాక్‌బాస్టర్ అయ్యాయి. ఈసారి కూడా గట్టిగా కొడుతున్నాం. అయితే ఈసారి నాన్న లేని లోటు మాత్రం ఉంది. ఇక నుంచి అభిమానులే నాకు అమ్మ, నాన్న.. ఏదైనా ఇక మీరే అని” చెబుతూ తీవ్ర భావోద్వేగానికి అయ్యారు.

డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) మాట్లాడుతూ “తెలుగు ఇండస్ట్రీలో నటన విషయంలో 200శాతం మహేష్‌(Mahesh Babu)ను కొట్టేవారు లేరు” చెప్పడం అభిమానులను జోష్‌లో నింపింది. అలాగే దిల్ రాజు మాట్లాడుతూ “మహేష్ బాబు ఈ సినిమా కలెక్షన్స్‌తో తాట తీస్తాడు. ఇందులో మహేష్‌ క్యారెక్టర్ పోకిరి, దూకుడు సినిమాల్లో చాలా మాస్‌గా ఉంటుంది” అని తెలిపారు.

ఇక ఈ సినిమాలో మహేష్ తల్లిగా రమ్యకృష్ణ(Ramya Krishna), తండ్రిగా జయరామ్, విలన్‌గా ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు నటించారు. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా మూవీ విడుదల కానుంది.

Read Also: చట్నీ తీసిన ప్రాణం.. బండ్ల గణేశ్‌ డ్రైవర్ అరెస్ట్..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...