సూపర్ స్టార్ కి నచ్చని కథ… మెగా స్టార్ కు నచ్చిందట…

సూపర్ స్టార్ కి నచ్చని కథ... మెగా స్టార్ కు నచ్చిందట...

0
83

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో మహేష్ బాబుకు నచ్చని కథ మరో స్టార్ హీరో రామ్ చరణ్ కు నచ్చిందా అంటే అవుననే ఫిలిం నగర్ లో వార్తలువస్తున్నాయి… దర్శకుడు వంశీపైడిపల్లి తన సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తుంటారు…

మహేష్ బాబు హీరో గా తెరకెక్కిన చిత్రం మహర్షి ఈచిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే… ఈ చిత్రం తర్వాత మహేష్ మళ్లీ వంశీతోనే చేస్తారని అనుకున్నారు కానీ సరిలేరునీకెవ్వరు చిత్రాన్ని అనిల్ రావుపుడితో చేశాడు… ఈ చిత్రం తర్వాత వంశీతో అనుకున్నారు..

కానీ మహేష్ రాజమౌళికి ఒకే చెప్పేశాడు… దీంతో మహేష్ తో చేయాలనున్న చిత్రాన్ని వంశీ చరణ్ తో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి… ఇదే కథను వంశీ మహేష్ కు వినిపించారట.. అయితే ఆ కథ ఆయనకు నచ్చలేదట… ఇక ఇదే కథన కాస్త మార్పులు చేసి చెర్రీకి వినిపించాడట దీంతో ఆ కథ చెర్రీకి నచ్చిందట… కథను కాస్త చేంజ్ చేయమని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.