సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారువారి పాట సినిమా చేస్తున్నారు.. ఇక ఈ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా దుబాయ్ లో జరుగుతోంది, ఇక మహేష్ అక్కడ షూటింగ్ లో పాల్గొంటున్నారు, తాజాగా ఆయన దుబాయ్ లోని
స్మార్ట్ పోలీస్ స్టేషన్ ని సందర్శించినట్లు తెలుస్తోంది. దీని గురించి గల్ఫ్ మీడియా వెల్లడిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసింది, ఇది దేశంలో అత్యంత స్మార్ట్ పోలీస్ స్టేషన్ గా ప్రాచుర్యం పొందింది.
తాజాగా ఆయన ఇక్కడ షూటింగ్ కు వెళ్లిన సమయంలో ఈ స్టేషన్ ని సందర్శించారు. ఇలాంటి టెక్నాలజీతో ఉన్న పోలీస్ స్టేషన్ ఇప్పటి వరకూ చూడలేని చాలా బాగుంది అని మహేష్ కితాబిచ్చారట. ఇక దుబాయ్ లో ఆయన షూటింగ్ చేస్తున్న సమయంలో అక్కడ వారికి కృతజ్ఞతలు తెలిపారు, దుబాయ్ విశిష్టతను తెలియజేస్తూ ఓ పోస్ట్ పెట్టారు
మహేష్ కొన్ని ఫోటోలను షేర్ చేసారు.
ఇటీవల కీర్తి సురేష్ కూడా ఇక్కడ షూటింగ్ లో పాల్గొన్నారు, మొత్తానికి మరో రెండు రోజుల్లో ఈ షూటింగ్ ఇక్కడ పూర్తి అవుతుంది అని తెలుస్తోంది, తర్వాత హైదరాబాద్ లో మరో షెడ్యూల్ చేయనున్నారట.