సూపర్​స్టార్​ మహేశ్​బాబు దాతృత్వం..పేద పిల్లల కోసం మరో ఫౌండేషన్

0
99

సూపర్​స్టార్​ మహేశ్​బాబు మరోసారి మంచి మనసును చాటుకున్నారు. మహేశ్​బాబు ఫౌండేషన్​.. రెయిన్​బో హాస్పిటల్​ భాగస్వామ్యంతో ‘ప్యూర్​ లిటిల్​ హార్ట్స్​’ అనే సంస్థను స్థాపించారు. ఈ ఫౌండేషన్​లో భాగంగా.. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పేద పిల్లలకు ఉచితంగా చికిత్స అందించనున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహేశ్​బాబు.. ఈ ఫౌండేషన్​ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. “ఈ ప్యూర్ లిటిల్​ హార్ట్స్​ ఫౌండేషన్​ను ప్రారంభించడం నాకు సంతోషంగా ఉంది. పిల్లలు ఎప్పుడూ నా మనసుకు దగ్గరగా ఉంటారు. చిన్న పిల్లల హృదయాలకు ఎక్కువ కేర్ తీసుకోవాలి.” అని అన్నారు.

‘మహేశ్​బాబు ఫౌండేషన్​’ ద్వారా ఇప్పటివరకు వేల మంది పేద పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్​లు చేయించి వారికి పునర్జన్మ ప్రసాదించారు​. రెయిన్​బో హాస్పిటల్స్, ఆంధ్రా హాస్పిటల్స్​ భాగస్వామ్యంతో గతేడాది తన స్వగ్రామమైన బుర్రిపాలెంలో ప్రజలందిరికీ ఉచితంగా కొవిడ్​ టీకాలు వేయించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.