సూపర్ స్టార్ రజనీకాంత్ మంచి మనసు కలిగిన వ్యక్తి, అంతేకాదు ఆయన స్నేహానికి కూడా అంతే విలువ ఇస్తారు..
కోలీవుడ్ లో ఆయనకు స్నేహితుడైన బహుముఖ నటుడు శివకుమార్ అంటే ఆయనకు చాలా ఇష్టం, ఆయన ఎవరో కాదు హీరో సూర్య తండ్రి, ఓ సారి ఆయన రజనీకాంత్ కి సలహా ఇచ్చారట, ఆ విషయాన్ని కూడా రజనీ ఓసారి గుర్తు చేసుకున్నారు.
రజనీకాంత్ మద్యపానం ధూమపాన అలవాట్ల గురించి ఆయన ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల గురించి ఎక్కడా ఏనాడూ రహస్యంగా దాచుకోలేదు.ఆయనకు ఉన్న అలవాట్ల వల్ల ఏనాడు ఫ్రెండ్ శివకుమార్ ఆయనని వదులుకోలేదు. మంచి స్నేహితులుగానే ఉన్నారు, అయితే నేను శివకుమార్ తో కొన్ని సినిమాల్లో పని చేశాను అని చెప్పారు రజనీకాంత్.
నేను మద్యపానం ధూమపానానికి బానిస అయిన సమయంలో.. నువ్వు గొప్ప నటుడిని అవుతావు.. ఈ అలవాట్లతో ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని శివకుమార్ నాకు సలహా ఇచ్చేవాడు అని రజనీ అన్నారు…రజనీకాంత్ 1977 లో కవికుయిల్ .. భువానా ఓరు కెల్వికురి ఈ రెండు సినిమాలు చేశారు ఈ చిత్రాలు హిట్ అయ్యాయి, అయితే ఇందులో సూర్య తండ్రి శిమకుమార్ కూడా నటించారు, ఆ మాట గుర్తు చేసుకున్నారు రజనీ.. నిజంగా ఆ అలవాట్లు నా ఆరోగ్యాన్ని పాడుచేశాయి అని తెలిపారు. తర్వాత రజనీకాంత్ వాటికి దూరంగా ఉన్నారు.