బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కేవలం వారం రోజుల్లో ముగుస్తుంది, టైటిల్ ఎవరికి వస్తుందో ఆదివారం తేలిపోతుంది, ఇక ఎవరి ఆట వారు ఆడుతున్నారు, మరీ ముఖ్యంగా వారి అభిమానులు భారీగా ఓటింగ్ చేస్తున్నారు, గత మూడు సీజన్లను దాటి ఈసారి ఓటింగ్ జరుగుతుంది అని భారీగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు..
టైటిల్ పోరులో అభిజీత్, అఖిల్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.ఇక తర్వాత సోహైల్ పేరు వినిపిస్తుంది, ఇక ఈసారి టైటిల్ అమ్మాయిలు గెలివాలి అని చాలా మంది మహిళలు అరియానా హారికకు ఓటింగ్ చేస్తున్నారు, అయితే
ఎక్కువ మంది సెలబ్రిటీలు అభికి ఓటు వేస్తున్నారు. వారి అభిప్రాయాలు చెబుతున్నారు అభికి మద్దతు ఇవ్వాలి అని ఓటింగ్ చేయాలి అని కోరుతున్నారు.
జర్నలిస్ట్ దేవీ నాగవల్లి ఇప్పుడు తన ఫేవరెట్ కంటెస్టెంట్ అరియానాకు ప్రచారం చేస్తున్నారు.
సమయం ఆసన్నమైంది. అరియానాను రక్షించుకుందాం అని తెలిపారు, ఇక హౌస్ నుంచి దేవీ నాగవల్లి బయటకు వచ్చిన సమయంలో అరియానా ఎంతో ఎమోషనల్ అయింది, ఈసారి అమ్మాయి గెలవాలి మనలో ఎవరు బయటకు వెళ్లినా ఇక్కడ ఉన్నవారు గెలిచే బాధ్యత తీసుకోవాలి అని అన్నారు, సో ఇప్పుడు అరియానాకు కూడా చాలా మంది మద్దతు ఇస్తున్నారు.