యాక్టర్ సురేఖావాణి భర్త సురేష్‌ తేజ మృతి..!!

యాక్టర్ సురేఖావాణి భర్త సురేష్‌ తేజ మృతి..!!

0
88

ప్రముఖనటి సురేఖావాణి భర్త, టివి షోల డైరెక్టర్‌ సురేష్‌ తేజ మృతి చెందారు. ఆయన గత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం నాడు చికిత్స పొందుతూ కన్నుమూశారు. సురేష్ తేజ్‌కు తెలుగు టీవీ, సినిమా రంగంలో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయన మరణవార్త తెలుసుకుని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కొందరు తోటి నటులు సురేఖవాణి ఇంటికి చేరుకుని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

సురేఖ టివి యాంకర్‌గా ఉన్న రోజుల్లో ఆమెను సురేష్‌ ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. మా టాకీస్‌, హార్ట్‌ బీట్‌, మొగుడ్స్‌ పెళ్లామ్స్‌ వంటి షోలకు సురేష్‌ దర్శకత్వం వహిస్తే సురేఖ యాంకర్‌గా వ్యవహరించారు.సురేష్ తేజ్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించినట్లు తెలుస్తోంది. ఆయన కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నట్లు సమాచారం. కొంతకాలంగా ఇందుకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం చివరి వరకు బయటకు తెలియకుండా గోప్యంగా ఉండటం గమనార్హం.