మెగాహీరో వైష్ణవ్ తేజ్ తో – సురేందర్ రెడ్డి సినిమా ?

Surender Reddy new movie with megahero Vaishnav Tej

0
128

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకి మెగాహీరో వైష్ణవ్ తేజ్ ఎంటర్ అయ్యారు. ఈ లవ్ స్టోరీకి ఎంత పేరు వచ్చిందో తెలిసిందే. ఆ ఒక్క సినిమాతోనే వైష్ణవ్ తేజ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత ఆయనకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. మంచి కథని సెలక్ట్ చేసుకుంటున్నారట వైష్ణవ్. తాజాగా ఆయనతో సినిమా చేయాలని నాలుగు పెద్ద బ్యానర్లు చూస్తున్నాయి.

ఇక తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆయన అన్నపూర్ణ బ్యానర్లో ఓ సినిమా చేయనున్నారట. అంతేకాదు ఆ తరువాత సినిమాను ఆయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్నాడనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి బలంగా వినిపిస్తోంది.

భోగవల్లి ప్రసాద్ ఈ సినిమాని నిర్మించనున్నారట. ఇక ఈ సినిమా కథని దశరద్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి ఏజెంట్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరువాత ఆయన వైష్ణవ్ తేజ్ తో సినిమా సెట్స్ పైకి తీసుకువెళతారు అని అంటున్నారు.