ఆ యంగ్ హీరో తో సురేందర్ రెడ్డి తదుపరి చిత్రం..!!

ఆ యంగ్ హీరో తో సురేందర్ రెడ్డి తదుపరి చిత్రం..!!

0
90

సైరా సినిమా హిట్ అవ్వడంతో అందరి కళ్ళు చిరు పైనే ఉన్నాయి.. అయితే ఆ తర్వాత అందరి చూపు దర్శకుడు సురేందర్ రెడ్డి పైనే ఉంది.ఎందుకంటే రాజమౌళి తర్వాత ఆ లెవెల్లో సినిమా ని తెరకెక్కించింది సురేందర్ రెడ్డి నే.. పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీయాలంటే చాల దమ్ము ఉండాలి.. రాజమౌళి కాకుండా మరో ఏ డైరెక్టర్ కి ఆ సత్తా ఉండదు అనుకున్నారు అంతా.. కానీ ఆ విషయం చర్చించుకుంటుంటే సురేందర్ రెడ్డి సినిమా ని తీసేశాడు..ఇప్పుడు అందరు ఆలోచించేది ఒక్కటే ఇంత భారీ బడ్జెట్ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి ఏ సినిమా చేయబోతున్నాడా అని..

ఈయన తదుపరి సినిమా ఏంటనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అయితే లేటెస్ట్ సినీ వర్గాల సమాచారం మేరకు సురేందర్ రెడ్డి తన తదుపరి సినిమాను స్టార్ హీరోతో కాకుండా యంగ్ హీరో అయిన నితిన్‌తో చేయబోతున్నాడని సమాచారం. అయితే ఇప్పటికే నితిన్ చాలా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. మరి వాటన్నింటినీ కాదని సురేందర్ రెడ్డితో సినిమా చేస్తాడా? అనేది ఆలోచించాల్సిన విషయం.