రానా ప్రేమ గురించి తండ్రి సురేష్ బాబు ఏమ‌న్నారంటే ?

రానా ప్రేమ గురించి తండ్రి సురేష్ బాబు ఏమ‌న్నారంటే ?

0
87

ఈ లాక్ డౌన్ వేళ హీరో రానా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు, నేను ప్రేమిస్తున్న అమ్మాయి నా ల‌వ్ యాక్సెప్ట్ చేసింది అని చెప్పాడు, దీంతో రానా పెళ్లిపై క్లారిటీ వ‌చ్చింది..మిహికా బజాజ్‌తో రానా వివాహం ఇక లాక్ డౌన్ త‌ర్వాత జ‌ర‌గ‌నుంది అని తెలుస్తోంది, అయితే దీనిపై తాజాగా ఆయ‌న తండ్రి నిర్మాత సురేష్ బాబు మాట్లాడారు.

మా కుటుంబమంతా చాలా హ్యాపీగా ఉంది. మిహికా, రానాకు చాలా రోజులుగా కలిసి ఉంటున్నారు. వారిద్దరి మధ్య కొన్నేళ్లుగా క్లోజ్ రిలేషన్ ఉంది. అయితే వారిద్దరు సరైన నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. వారి పెళ్లి గురించి ఇప్పడే మాట్లడం సరికాదు. సరైన సమయంలో మీకు అన్ని విషయాలు వెల్లడిస్తాం అని తెలిపారు.దీంతో ఇంట్లో అంద‌రూ చాలా సంతోషంగా ఉన్నారు.

ఈ ఏడాదిలో పెళ్లి జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి అని తెలుస్తోంది.లాక్‌డౌన్ ముగిసిన వెంటనే వివాహం జరిపించేలా ఏర్పాట్లు చేసుకొంటున్నాం అన్నారు. పెళ్లి డేట్ ఎప్పుడనేది అన్ని విషయాలు ఇరుకుటుంబాలు మాట్లాడుకొన్న తర్వాత మీడియాకు వెల్లడిస్తాం అని సురేష్ బాబు అన్నారు.