సురేష్ బాబు కొత్త ప్లాన్స్ రానాతో బిగ్ ప్రాజెక్ట్

సురేష్ బాబు కొత్త ప్లాన్స్ రానాతో బిగ్ ప్రాజెక్ట్

0
77

ఈ ఏడాది పూర్తి అయిపోతోంది.. ఇక మిగిలిన‌రోజుల్లో కొన్ని సినిమాలు ఫినిష్ అవుతాయి.. తాజాగా వ‌చ్చే ఏడాదికి కొన్ని సినిమాలు ముందుగానే ఫిక్స్ చేసుకున్నారు ప్ర‌ముఖ నిర్మాత డి సురేష్ బాబు.
సినిమాల ప‌రంగా 2020కి చాలా ప్లాన్స్ చేసి పెట్టుకున్నారు. కేవలం స్ట్రైట్ తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాషల్లో సూపర్ హిట్లుగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రాలను తెలుగులోకి అనువదించే పనిలో ఉన్నారు.

చిన్న సినిమాలు నిర్మించ‌డమే కాదు రీమేక్ చిత్రాల‌పై కూడా ఆయ‌న ఫోక‌స్ చేయాల‌ని చూస్తున్నారు. మంచి క‌థ‌తో వ‌స్తే సురేష్ బాబు ద‌ర్శ‌కుల‌కు వెల్ కం చెబుతున్నారు.. డ్రీమ్ గర్ల్, సోనూ కే టిక్కూ కే స్వీటీ ఈ చిత్రాలు హిందీ నుంచి నేరుగా తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు.

ఇవి కాకుండా మ‌రో రెండు కొరియన్ చిత్రాలు కూడా ఉన్నాయట. అయితే ఆ చిత్రాలు ఏమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం ఈ ఐదు సినిమాల్లో కనీసం మూడు చిత్రాలైనా వచ్చే యేడాదికి పట్టాలెక్కే ఛాన్సుంది. అయితే ఆయ‌న త‌న‌యుడు రానాతో రూ.180 కోట్లతో హిరణ్యకశ్యప చిత్రం ప్లాన్ చేశారు వ‌చ్చే ఏడాది.