ఈ రోజుల్లో లవ్ ఓరియెంటెడ్ చిత్రాలు బాగా సక్సెస్ అవుతున్నాయి, ముఖ్యంగా యూత్ కి బాగా నచ్చుతున్న స్టోరీలు ఇవి.. ఇక దర్శకులు కూడా ఈ పాయింట్ పై సినిమాలు అనేకమైనవి తీస్తున్నారు, తెలుగులోనే కాదు దేశీయంగా అనేక భాషల్లో ఈ కాన్సెప్టులు నచ్చుతున్నాయి.ఈమధ్య వచ్చిన ఉప్పెన చిత్రం కూడా అటువంటిదే.
ఇక దర్శకుడి పనితీరు కూడా సినిమాలో అందరికి బాగా నచ్చింది, ఇక దర్శకుడు బుచ్చిబాబుకి మంచి పేరు వచ్చింది, ఇప్పుడు ఆయనని కథలు చెప్పమని చాలా మంది హీరోలు అడుగుతున్నారు, ఇక మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు అని అందరూ అంటున్నారు.
ఇక పలు ఆఫర్లు వస్తున్నాయి ఆయనకు.. అక్కినేని నాగ చైతన్య హీరోగా ఆయన తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడని టాలీవుడ్ టాక్ నడుస్తోంది… ఇక తాజాగా ఆయన చైతూకి సెట్ అయ్యే కథ చెప్పారట.. ఈ స్టోరీ బాగోవడంతో ఒకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి…మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా చేయనుంది అని టాక్.