లోకనాయకుడు సీనియర్ నటుడు మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ ఆస్పత్రిలో చేరారు, ఇటు రాజకీయాలతో సినిమాలతో బిజిగా ఉన్న ఆయన తాజాగా చెన్నైలోని శ్రీ రామచంద్ర ఆస్పత్రిలో చేరగానే ఆయన అభిమానులు షాక్ అయ్యారు. దీనిపై ఆస్పత్రి ప్రటకన చేసింది.
మంగళవారం ఉదయం ఆయన కాలుకు సర్జరీ చేసినట్టు వైద్యులు తెలిపారు. అయితే ఆయన కుడి కాలు బోన్లో చిన్న ఇన్ఫెక్షన్ రావడంతో ఇన్ఫెక్షన్ పార్ట్ను తొలగించేందుకు ఈ రోజు ఉదయం ఆయనకు సర్జరీ చేయడం జరిగింది…ప్రస్తుతం కమల్ ఆరోగ్యంగాఉన్నారు అని వైద్యులు తెలిపారు.. కమల్ కుమార్తెలు అక్షర శృతి కూడా ఈ విషయం తెలిపారు.. దీంతో
అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇటీవల రాజకీయంగా మీటింగులతో బిజీగా ఉన్నారు కమల్, అంతేకాదు బిగ్ బాస్ తమిళ్ కు హోస్ట్ గా ఉన్నారు, అలాగే
శభాష్ నాయుడు అనే చిత్రంలో ఆయన నటిస్తున్నారు, అయితే ఇటీవల చిత్ర షూటింగులో ఆయనకు యాక్సిడెంట్ అయింది
అప్పుడు ఆయన కాలుకు సర్జరీ జరిగింది… విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినా కమల్ లెక్క చేయలేదు, ఇప్పుడు మళ్లీ అక్కడే ఇన్ఫెక్షన్ రావడంతో ఆయన ఆస్పత్రిలో చేరి సర్జరీ చేయించుకున్నారు, ప్రస్తుతం కమల్ కోలుకుంటున్నారట.