Surya | టాలీవుడ్ హీరోల గురించి సూర్య ఏమన్నారంటే..

-

తమిళ, తెలుగు స్టార్ హీరో సూర్య(Surya). ఎప్పటికప్పుడు వినూత్నమైన కథలతో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను అలరించడంలో తన మార్క్ చూపుతాడు. తమిళనాడుతో పాటు ఆంధ్రలో కూడా సూర్య అభిమానులకు కొదవలేదు. అలాంటి సూర్య ప్రస్తుతం ‘కంగువా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్ కానుంది. ఈ ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్‌(Kanguva Promotions)లో సూర్య ఫుల్ యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు.

- Advertisement -

ప్రతిరోజూ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోల ప్రస్తావన రావడంతో సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి వారిపై కూడా మాట్లాడాడు. అంతేకాకుండా కొందరితో మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందని చెప్పాడు. ఇంతకీ సూర్య(Surya) ఏమన్నాడంటే..

ప్రభాస్: ప్రభాస్ తో మల్టీస్టారర్ చేస్తే ఫుల్ యాక్షన్ మూవీ చేస్తాను.

మహేశ్ బాబు: స్కూల్లో మహేశ్ నాకు జూనియర్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. ఎమోషన్స్ బాగా చూపిస్తారు.

రామ్ చరణ్: గ్లోబల్ స్టార్ చరణ్ నాకు సోదరుడితో సమానం. నా సినిమాలు చూసి ఫోన్ చేసి ప్రశంసిస్తారు. వాళ్ల కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.

అల్లు అర్జున్: నేను ఇక్కడ ఉండటానికి అల్లు అరవింద్ కూడా ఓ కారణం. ‘గజిని’ సినిమాను ఆయనే డిస్ట్రిబ్యూట్ చేశారు. అల్లు అర్జున్ చాలా కష్టపడతాడు. డ్యాన్స్ సూపర్‌గా చేస్తాడు. అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప2’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నా.

ఎన్టీఆర్: ఎన్టీఆర్ తెలుగు మాట్లాడే విధానం ఆకట్టుకుంటుంది. చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఆ విషయం నన్నెంతో ఆకట్టుకుంటుంది.

Read Also: పదేళ్ల కిందటే పూర్తయిన స్టార్ హీరో సినిమా.. ఇప్పటికి రిలీజ్..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...