తగ్గేదేలే అంటున్న హీరో సూర్య..పాన్‌ ఇండియా మూవీగా ‘ఈటీ’

'Surya' as Pan-India movie

0
108

తమిళ హీరోనే అయినా టాలీవుడ్‌ హీరోలతో సమానంగా తెలుగు అభిమానులను సంపాదించుకున్న నటుడు సూర్య. ఇటీవల ఆయన నటించిన ‘జై భీమ్‌’ చిత్రం ఓటీటీలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

సూర్య నటిస్తోన్న కొత్త చిత్రం.. ఈటీ పాన్‌ ఇండియాగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సన్‌ పిక్చర్స్‌ నిర్మాణంలో పాండిరాజ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే, ఈ చిత్రాన్ని ఐదు (తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ) భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా వెల్లడించింది. ఈ మేరకు సినిమా పోస్టర్‌ను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది.

ఈ చిత్రంలో సూర్యకి జోడిగా ప్రియాంక అరుల్‌ మోహన్‌ నటిస్తోంది. వినయ్‌రామ్‌, సత్యరాజ్‌, జయప్రకాశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి. ఇమ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. పాండిరాజ్‌ దర్శకత్వంలో సూర్యకి ఇది రెండో సినిమా. ఇది వరకు వీరి కాంబినేషన్‌లో పసంగా-2: హైకూ చిత్రం తెరకెక్కింది. 2015లో వచ్చిన ఈ చిత్రం తెలుగులో ‘మేము’గా విడుదలైంది.