సూర్య ఫ్యాన్స్ కి పండగే…‘ఈటి’ మూవీ తెలుగు టీజర్ విడుదల (వీడియో)

0
120

తమిళ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ఈటి. ఇప్పటికే  ‘ఆకాశమే నీ హద్దురా’, ‘జై భీమ్’ సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. జై భీం సినిమా ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచింది. విమర్శకుల ప్రశంసలను పొందింది. తాజాగా మరో విభిన్న సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు సూర్య.

తాజాగా సూర్య నటించిన సినిమా ‘ఈటి.’ ఈ సినిమాలో సూర్య పక్కన.. ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. డి. ఇమాన్ మ్యూజిక్ అందించారు. సన్ పిక్చర్ పతాకంపై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మార్చి 10న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

తాజాగా సూర్య నటించిన ‘ ఈటి’ మూవీ టీజర్ రిలీజ్ అయింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందుతునంది ఈటి. టీజర్ చూస్తే మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా వస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య ఎప్పటిలాగే అదరగొట్టాడు.

https://www.youtube.com/watch?v=GV3TeE9LkLo&feature=emb_title