Rajamouli | సూర్య స్ఫూర్తితోనే బాహుబలి.. రాజమౌళి ఇలా అన్నారేంటి..!

-

తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ సినిమా ‘కంగువా(Kanguva)’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి(Rajamouli) స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ సూర్యపై ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్య స్ఫూర్తితోనే పాన్ ఇండియా సినిమాలు చేశానని జక్కన్న చెప్పాడు. తనకు ఎన్నో ప్రాజెక్ట్‌లు, విజన్ విషయంలో సూర్య సూర్తి అని.. అసలు పాన్ ఇండియాలో సినిమా తీయాలన్న తన ఆలోచనకు కూడా సూర్యనే స్ఫూర్తిని ఇచ్చారని రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఆఖరికి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌లను తునాతునకలు చేసి సరికొత్త రికార్డ్‌లు సృష్టించి, టాలీవుడ్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ‘బాహుబలి’కి కూడా సూర్యనే స్ఫూర్తి అని వెల్లడించాడు జక్కన్న.

- Advertisement -

‘‘తెలుగు సినిమాని తెలుగు ప్రేక్షకులకే పరిమితం చేయకుండా ప్రపంచానికి చూపించాలన్న విషయంలో నాకు సూర్య స్ఫూర్తి. ‘గజిని(Ghajini)’ సినిమా సమయంలో చేసిన ప్రచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించా. వేరే రాష్ట్ర చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు తెలుగు ప్రేక్షకులకు ఎలా దగ్గరయ్యాడు? ఆ విషయాన్ని కేస్ స్టడీగా తీసుకోమని మన హీరోలు, నిర్మాతలకు కూడా చెప్పే వాడిని. అలా నా పాన్ ఇండియా సినిమా బాహుబలికి కూడా సూర్య(Surya) స్ఫూర్తిగా నిలిచాడు. సూర్యతో కలిసి సినిమా కూడా చేయాలనుకున్నా.. కానీ కుదరలేదు. సూర్యను డైరెక్ట్ చేసే అవకాశాన్ని నేను మిస్ అయ్యాను’’ అని జక్కన్న వెల్లడించాడు. రాజమౌళి(Rajamouli) మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Read Also: విపరీతమైన తలనొప్పిలో టాబ్లెట్లే భోజనంలా మారుతున్నాయా.. ఇవి ట్రై చేయండి..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...