సూర్య కెరీర్ లో ఇది అత్యంత డిజాస్టర్..!!

సూర్య కెరీర్ లో ఇది అత్యంత డిజాస్టర్..!!

0
92

తమిళ స్టార్ హీరో సూర్య ఈమధ్య తన సినిమాలతో మెప్పించలేకపోతున్నాడనే చెప్పాలి.. గత కొన్ని సినిమాలు గా అయన చేస్తున్నావని యావరేజ్ టాక్ కూడా తెచ్చుకోలేకపోతుంది.. ఇక ఇటీవలే రిలీజ్ అయినా బందోబస్త్ సినిమా అయితే మరి దారుణంగా ఫ్లాప్ అయ్యింది..

వారం రోజుల కిందట విడుదలైన ఈ సినిమాకు మొదటి వారంలో కేవలం కోటి 75 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. కనీసం 2 కోట్లు కూడా దాటలేదంటే సూర్య పరిస్థితి తెలుగులో ఎంత దయనీయంగా తయారైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వసూళ్ల పరంగా చూసుకుంటే డిజాస్టర్ అనే పదం కూడా చాలా చిన్నదే.

గతంలో నాగార్జున నటించిన ఆఫీసర్ సినిమా డబుల్ డిజాస్టర్ గా పేరుతెచ్చుకుంది. ఆ తర్వాత బాలయ్య నటించిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు రెవెన్యూ పరంగా డిజాస్టర్లు అనిపించుకున్నాయి. ఇప్పుడు వాటి కంటే తక్కువ షేర్లు కలెక్ట్ చేసి డిజాస్టర్ల లిస్ట్ లో నంబర్ వన్ స్థానంలో నిలిచాడు సూర్య. బందోబస్ట్ వసూళ్లతో పోల్చిచూస్తే.. ఎన్జీకే కు మంచి కలెక్షన్లు వచ్చినట్టయింది. ఏదేమైనా సూర్య తన పంథా మార్చాలని అభిమానులు కోరుకుంటున్నారు..