ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్‌తో సూర్య నెక్స్ట్ మూవీ..

0
97

ప్రస్తుతం యంగ్ హీరో సూర్య వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మంచి కధ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు. ఇప్పటికే టి.జె జ్ణాన‌వేల్‌ దర్శకత్వంలో నటించిన అన్ని సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించి విశేషాప్రేక్షాదరణ సొంతం చేసుకున్నాడు.

ఇటీవలే వీరిద్దరి కాంబోలో వచ్చిన  ‘జై భీమ్’ ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ క్రమంలో సూర్య ఈ సినిమా తరువాత ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా సమయంలో మళ్ళి ఆ డైరెక్టర్ తోనే సినిమా చేయడానికి ఒకే చెప్పాడు.

ఈ విషయాన్నీ స్వయంగా  జ్ణాన‌వేల్ వెల్లడించడంతో సూర్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ‌తేడాది న‌వంబ‌ర్‌లో నేరుగా ఓటీటీలో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఈ సినిమాతో పాటు త్వరలో మళ్ళి వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ క‌న్ఫార్మ్ అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.