బిగ్ బాస్ హౌస్ లో ఇలా వెళ్లి అలా ఒక వారంలోనే వచ్చేసింది స్వాతి దీక్షిత్… అయితే స్వాతి ఇలా వెంటనే బయటకు రావడం అభిమానులకి కూడా షాక్ కి గురి చేసింది, టీవీ 9దేవి అలాగే స్వాతి ఇద్దరూ బయటకు రావడంతో ఇదేంటి బిగ్ బాస్ ఇలా చేశావు అని అందరూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.
అయితే ఓటింగ్ ప్రకారం అలా జరిగింది అంటున్నారు బిగ్ బాస్ అభిమానులు, అయితే స్వాతి హౌస్ లో అతి తక్కువ సమయంలో నోయల్ తో బాగా కనెక్ట్ అయింది, మంచి స్నేహితులు అయ్యారు.
ఇంటి నుండి బయటకు వచ్చిన స్వాతి..ఇంటి సభ్యులు ముఖ్యంగా నోయల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇంటిలో ఉన్న అందరిలో నోయల్ అంటే తనకు ఇష్టం అని చెప్పింది, చాలా మంచి వ్యక్తి అని పాజిటీవ్ ఎనర్జీతో ఉంటాడు అని తెలిపింది.చివరి వరకు ఉండే ఐదుగురు సభ్యుల్లో నోయల్ ఒకరని జోస్యం తెలిపింది స్వాతి.అమ్మా రాజశేఖర్ మామూలు వ్యక్తి కాదని.. ఈయన చాలా కంత్రీ అస్సలు నమ్మ కూడదని తెలిపింది. ఇక హౌస్ లో ఆమెని అమ్మ రాజశేఖర్ నామినేట్ చేయడంతో ఆమె బయటకు వచ్చింది అని చాలా మంది కామెంట్లు పెట్టారు.