సైరా సినిమా సెన్సార్ టాక్..మెగా ఫ్యాన్స్ కి పండగే

సైరా సినిమా సెన్సార్ టాక్..మెగా ఫ్యాన్స్ కి పండగే

0
82

చిరంజీవి నటించిన సైరా సినిమా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోగా ఆ ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్, రాజమౌళి ముఖ్య అతిధులుగా వచ్చిన సంగతి తెలిసిందే.. శ్రీమతి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ నిర్మించారు.సురేందర్‌రెడ్డి దర్శకుడు. అమిత్‌ త్రివేది స్వరకర్త.

కాగా ఈ చిత్రం సెన్సార్ నేడు పూర్తి చేసుకుంది.. సెన్సార్ నుంచి అద్భుతమైన ప్రశంసలతో పాటు యుబైఏ సర్టిఫికెట్‌ను ఈ చిత్రం సొంతం చేసుకుంది. 5 భాషల్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు నిర్మాత రామ్ చరణ్ సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రం అక్టోబర్ 2, గాంధీజయంతి కానుకగా విడుదల కాబోతోంది.