Taapsee Pannu | భారీ రెమ్యునరేషన్‌పై క్లారిటీ ఇచ్చిన తాప్సీ

-

బాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్లలో తాప్సీ పన్ను(Taapsee Pannu) పేరు తప్పకుండా ఉంటుంది. అమ్మడు ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకెళ్తునే మరోవైపు బడా హీరోలతో కమర్షియల్ సినిమాల్లో కూడా తన మార్క్ చూపిస్తోంది. ఈ క్రమంలోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు, కమర్షియల్ సినిమాలకు తీసుకునే పారితోషికం విషయంలో తాప్సీ పక్కాగా ఉంటుందని, కమర్షియల్ సినిమాల్లో బడా సినిమాలకు అంతే భారీగా పారితోషికం అందుకుంటుందని వార్తలు తెగ వినిపిస్తున్నాయి. ఇటీవల తాప్సీ నటించిన జుడ్వా2, డంకీ సినిమాలకు అమ్మడు రెండు మూడు రెట్లు అధిక రెమ్యునరేషన్ తీసుకుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాస్పీ.. ఈ వార్తలపై ఘాటుగా స్పందించారు.

- Advertisement -

‘‘ఈ రెండు సినిమాలకు నేను భారీ పారితోషికం(Remuneration) పుచ్చుకున్నానని కొందరు భావిస్తున్నారు. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదు. ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల పారితోషికాల్లో భారీ వ్యత్యాసమే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన నిజం. కొందరు నిర్మాతలైతే మాకు అవకాశం ఇస్తున్నందుకు ఫ్రీగా చేసినా తప్పులేదన్నట్లు వ్యవహరిస్తారు. మరికొందరు ఇప్పటికే మా సినిమాలో పెద్ద హీరో ఉన్నారు.. అలాంటప్పుడు ప్రేక్షకులను ఆకర్షించడానికి బడా హీరోయిన్లను ఎంచుకోవాల్సిన అవసరం ఏముంది? అన్నట్లు ప్రవర్తిస్తారు. మరికొందరు మేము మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాం.. అందులో అవకాశం కల్పించి మీ కెరీర్ ఉన్నతికి సాయం చేస్తున్నాం.. డబ్బుదేముంది అన్నట్లు మాట్లాడతారు. ఇలాంటి వాటిపై నేను(Taapsee Pannu) ప్రతి రోజూ పోరాటం చేస్తున్నా. పెద్ద ప్రొడక్షన్స్‌లో హీరోయిన్ల పాత్రలపై చిన్న చూపు ఉంటుంది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమ్మడి మాటలు తెగ వైరల్‌గా మారుతున్నాయి.

Read Also: కీ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...