Taapsee | ‘నాది పెళ్ళి కాదు’.. అసలు విషయం చెప్పిన తాప్సీ

-

తన పెళ్ళిపై బాలీవుడ్ భామ తాప్సీ పన్ను(Taapsee) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ఏడాదే అమ్మడు తన ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్‌బో‌తో(Mathias Boe) వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ఉదయ్‌పూర్‌ వేదికగా అమ్మడు తన ప్రియుడితో ఏడడుగులూ నడిచింది. చాలా సంవత్సరాల పాటు రిలేషన్‌లో ఉన్న వీరు గతేడాది.. ఒక్కటయ్యారు. దంపతులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

- Advertisement -

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ.. తన పెళ్ళికి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఉదయ్‌పూర్‌లో జరిగింది పెళ్ళి కాదని చెప్పింది. తన పెళ్ళి గతేడాదే జరిగిపోయిందని, ఉదయ్‌పూర్‌లో జరిగింది తూతూ మంత్రంగా చేసుకున్న పెళ్ళేనని తెలిపింది.

‘‘మా పెళ్ళి గతేడాదే జరిగిపోయింది. 2023 డిసెంబర్‌లోనే నేను, నా ప్రియుడు వివాహం చేసుకున్నాం. మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. ఉదయ్‌పర్‌లో వివాహ వేడుక మాత్రమే నిర్వహించాం. వ్యక్తిగత విషయాలను మేము పెద్దగా బయటకు చెప్పం. అందుకే ఇన్నాళ్లూ ఈ విషయాన్ని బయట పెట్టలేదు. పర్సనల్ విషయాలు బయటపెడితే వర్క్ జీవితంపై ప్రభావం పడుతుంది. అందుకే ఇన్ని రోజులు విషయాన్ని రహస్యంగా ఉంచాం’’ అని తాప్సీ(Taapsee) చెప్పింది.

Read Also: ప్రముఖ తబలా విధ్వంసకుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Aamir Khan | ‘మహాభారతం’ విషయంలో భయంగా ఉంది: ఆమిర్ ఖాన్

‘మహాభారతం’ చాలా మంది డైరెక్టర్ల డ్రీమ్ ప్రాజెక్ట్. వారిలో టాలీవుడ్ ప్రముఖ...

Prakash Raj | మరోసారి రెస్పాన్సిబుల్ ఫాదర్‌గా ప్రకాష్ రాజ్..

పాత్ర ఏదైనా ఒదిగిపోయి నటించి ఆ పాత్రకే వన్నె తెచ్చే నటుడు...