నాకు నచ్చినది చేశా.. నచ్చనిది వదిలేశా.. టబూ

నాకు నచ్చినది చేశా.. నచ్చనిది వదిలేశా.. టబూ

0
89

ఇండస్ట్రీలో నటి టబూ మూడు దశాబ్దాల నటన ప్రయాణంలో ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమ్మడు నటిగా తాను ఎలా కావాలంటే అలా నటించానని తెలిపింది.

ఓ సినిమా అంగీకరించే ముందు నాలో నేను చాలా ప్రశ్నలు వేసుకుంటా అని అంటూంది టబూ.సినిమా ఆఫర్ వచ్చినప్పుడు ఈ సినిమాలో నటిస్తే ఎలా ఉంటది, నటించకుంటే ఎలా ఉంటుంది అనే ప్రశ్న నాకు నేను వేసుకుంటా ఇది నామీద నాకు సందేహంతో కాదు నన్ను నేను సరిచేసుకునేందుకే.. చిత్రంలో నటించేందుకు, వద్దనుకునేందుకు కారణాలేంటో ఆలోచించాక ఒప్పుకోవచ్చు అనుకుంటే ముందుకెళ్లా. లేదనుకుంటే వదిలేస్తా అంటున్నారు.

ఏ వృత్తిలోనైనా జయాపజేయాలు సహజం అన్నారు. అపజయాలు వచ్చినప్పుడు నేనేదో కోల్పోయానని నేను బాధపడను ఇక్కడ నాకు నచ్చినది చేశా. నచ్చనిది వదిలేశా అని చెప్పుకొచ్చింది టబూ.